Shocking Comments : పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్.. చిరుతో మూవీస్ రిజెక్ట్

సలార్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్‌లో వరదరాజమన్నార్ పాత్రలో నటించి మెప్పించాడు. ప్రభాస్ అంటే ప్రాణమిచ్చే దోస్తుగా.. ఎదురుపడే ప్రత్యర్థిగా నటించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్.. ది గోట్ లైఫ్.. మూవీ ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నాడు.
మార్చి 28న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీ షూటింగ్ 2018లో మొదలుపెట్టారు. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న ఓ వ్యక్తి కథే ఈ మూవీ. ఇది ఓ నిజజీవిత స్టోరీ ఆధారంగా రూపొందింది. ఈ సినిమా కోసం 31 కిలోల బరువు తగ్గారు పృథ్వీరాజ్. మూవీని మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ది గోట్ లైఫ్ రిలీజ్ ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ది గోట్ లైఫ్ మూవీ టీంతో పాటు.. తెలుగు నుంచి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ వై.యస్.రవిశంకర్, శశి పాల్గొన్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రెస్ ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు.
చిరంజీవితో రెండుసార్లు నటించే అవకాశం వచ్చినా.. రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ వివరించాడు. మొదటి చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాలో ఓ కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చిందని.. అయితే అడు జీవితం సినిమా కోసం దానిని వదులుకున్నానని చెప్పారు. చిరంజీవి కాల్ చేసి నన్ను అడిగారు.. ఈ మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నా అందుకే కుదరడం లేదంటూ వివరించారని చెప్పుకొచ్చాడు. లూసిఫర్ తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్ సినిమాకు కూడా డైరెక్ట్ చేయమని నన్ను అడిగారు. అప్పుడు కూడా నేను గోట్ లైఫ్ సినిమా కంటిన్యూ చేస్తూ ఉండడంతో మళ్ళీ కాదని చెప్పా. అన్నాడు. చిరంజీవి సినిమాల్లో నాకు నటించడం ఎంతో ఇష్టమనీ.. కానీ కుదరడం లేదని చెప్పాడు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com