Kalki 2898 AD : అశ్వనీదత్, స్వప్న దత్ ఓ బావి తవ్వాలి: రామ్ గోపాల్ వర్మ

హీరో ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి’ రిలీజైన 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ‘నాగ్ అశ్విన్‌పై ఎంతో విశ్వాసం ఉంచినందుకు అశ్వనీదత్, స్వప్నదత్‌లకు నా కృతజ్ఞతలు. ఈ సినిమా ద్వారా వస్తోన్న డబ్బును నిల్వ చేయడానికి తండ్రీకూతుళ్లు ఓ లోతైన బావిని తవ్వాల్సి వస్తుంది’ అని ట్వీట్ చేశారు. ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ కూడా నటించారు.
కల్కి 2898AD మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. 4 రోజుల్లో ₹555 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. హిందీ వెర్షన్ రికార్డు స్థాయిలో ₹115 కోట్లు సాధించినట్లు చెప్పారు. US, కెనడాలో $11 మిలియన్లు(₹91.81 కోట్లు) కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. UKలో ₹9.38 కోట్లు, ఆస్ట్రేలియాలో ₹9 కోట్లు, జర్మనీలో ₹1.30 కోట్లు, న్యూజిలాండ్‌లో ₹93 లక్షలు వసూలు చేసినట్లు తెలిపాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com