Pawan Kalyan : పవన్..! సినిమాలు మానద్దు.. హరిరామ జోగయ్య లేఖ

ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి వరుసగా లేఖలు రాస్తూ వస్తున్నారు కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య. పొత్తుల విషయంలో.. సీట్ల విషయంలో, అధికారం పంచుకునే విషయంలో, ఇలా అనేక సూచనలు చేస్తూ వచ్చారు. అయితే, ఇప్పుడు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫుల్ టైం పొలిటీషియన్ గా మారడంతో సినిమాలు చేస్తారా? లేదా? అనే చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు చేగొండి హరిరామ జోగయ్య రాజకీయ విశ్లేషణ లేఖ రాశారు. కూటమి ఏర్పాటు ద్వారా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన.. మీ హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమపాళ్లలో పరుగులు పెట్టస్తారని ఆశిస్తున్నాను అన్నారు. ప్రధానంగా కాపులు ఆశిస్తున్న ఐదు శాతం రిజర్వేషన్లను మీ పాలనలో అమలు చేస్తారని ఆశిస్తున్నాను అని లేఖలో పేర్కొన్నారు జోగయ్య.
కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని కోరారు. సినిమాలు మానేయకుండా సగం రోజులు సినిమాలకు, సగం రోజులు పరిపాలనకు కేటాయించాలనీ నా సూచన అంటూ ఆ లేఖలో రాసుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com