Shruti Haasan : లోకేశ్‌తో శృతిహాసన్ రొమాన్స్.. వీడియో వైరల్

తమిళనాడు ట్రెండింగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ (Lokesh) తో శృతిహాసన్ (Shruti Haasan) రొమాన్స్ వైరల్ అవుతోంది. వీడియోలో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తూ రొమాన్స్‌తో రెచ్చిపోయారు. తాజాగా రిలీజ్ అయిన ఈ మ్యూజిక్ ఆల్బమ్ ప్రోమో చూస్తేనే అది క్లియర్ గా అర్థమవుతుంది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన 18 సెకండ్ల ప్రోమోలో మ్యూజిక్ బిట్ పెద్దగా లేకపోయినా.. వీరిద్దరి రొమాన్స్ మాత్రం ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసింది.
ఆర్కే బ్యానర్ పై ఆర్ మహేంద్రన్ థోమ్‌తో కలిసి కమలహాసన్ మ్యూజిక్ వీడియో ఇనిమోల్ నిర్మించారు. అయితే ఇక్కడ ఈ ఎనిమల్ ఫుల్ సాంగ్ తెలుగు, తమిళ్ భాషలో మార్చి 25న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో నెట్టింట వైరల్ అవడంతో అభిమానులంతా ఫిదా అవుతున్నారు.
కేవలం సాంగ్ కాదు.. ఈ కాంబోలో సినిమా కావాలి అంటూ.. వీరిద్దరి రొమాన్స్ అదిరిపోయింది అంటూ తమ అభిప్రాయాని వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యూజిక్ వీడియోకి శృతిహాసన్ నటనతో పాటు కాన్సెప్ట్ కూడా అందించారని టాక్. ఈ ఇనిమల్ మ్యూజిక్ ఆల్బమ్ కు కమలహాసన్ లిరిక్ రైటర్ గా వ్యవహరించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com