Salaar : టీవీలో వస్తున్న సలార్.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ లాక్

Salaar : టీవీలో వస్తున్న సలార్.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ లాక్

ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్. చాలాకాలం తర్వాత ఫ్యాన్స్ ఎంజాయ్ చేసిన ప్రభాస్ మూవీ సలార్.. సీజ్ ఫైర్ పార్ట్ 1. ఈ మూవీ సీక్వెల్ కూడా వేగంగా తెరకెక్కుతోంది. సలార్ వైబ్స్ నుంచి ఇంకా ఫ్యాన్స్ కూడా బయటపడలేదు. అప్పుడే ఈ మూవీ వలర్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అయిపోయింది.

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1 గతేడాది డిసెంబర్ 22 రిలీజై బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో కొన్ని వారాల పాటు సందడి చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా సొంతం చేసుకుంది.

ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఏప్రిల్ 21, 2024 సాయంత్రం 05.30 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో ప్రదర్శించబడనుంది. యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరీ రావు, గోపీ, శ్రీయా రెడ్డి, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు.

Tags

Read MoreRead Less
Next Story