Sandeep Reddy Vanga : లుక్కు మార్చిన సందీప్ వంగా.. తిరుమలలో ప్రభాస్ మొక్కు!

సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదో సక్సెస్ మంత్రం. తన డైరెక్షన్ తో ప్రతి ఒక్కరిని ఆకర్షించారు. అదేవిధంగా తన గట్స్ చూసి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు కూడా. ఈ ఇండస్ట్రీ కాకపోతే మరొక ఇండస్ట్రీ అంటూ తన పని తాను చూసుకుంటూ పోతాడు. అటువంటి సందీప్ వంగా ఇటీవలే యానిమల్ సినిమాతో ప్రేక్షకుల మందికి వచ్చి భారీ విజయాన్ని దక్కించుకున్నాడు.
సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం ప్రభాస్ కోసం స్పిరిట్ కథ ప్రి-ప్రొడక్షన్ పనల్లో ఉన్నాడు. ఈ సినిమాపై రెబల్ స్టార్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది.
స్పిరిట్, యానిమల్ పార్క్ మూవీస్ పనులను సైమల్టేనియస్ గా నడిపిస్తన్నాడు సందీప్ రెడ్డి వంగా. స్పిరిట్ స్క్రిప్ట్ ను తిరుమలకు తీసుకెళ్లి స్వామి పాదాల వద్ద ఉంచాడు. గుండు కొట్టించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ' నేను ప్రతి ఏడాది ఇక్కడికి వస్తా. ఈసారి కొంచెం లేట్ అయింది అంతే. త్వరలో మూవీ స్టార్ట్ కానుంది' అని సందీప్ రెడ్డి వంగా తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com