Kalki 2898 AD : కల్కిలో తళుక్కున మెరిసిన స్టార్ట్స్ వీళ్లే!

Kalki 2898 AD : కల్కిలో తళుక్కున మెరిసిన స్టార్ట్స్ వీళ్లే!
X

ప్రభాస్ ( Prabhas ) హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన మూవీ కల్కి 2898 ఏడీ. ఇవాళే విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. ఈ సినిమాతో ప్రభాస్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి.

మూవీ కోసం భవిష్యత్ కాశీ, కాంప్లెక్స్, శంబల అనే మూడు ప్రపంచాల్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతంగా క్రియేట్ చేశాడు. ఆ మూడు ప్రపంచాల నేపథ్యంలోనే ఈ కథ సాగుతుంది. అందుకు అనుగుణంగానే యాక్టర్స్ కూడా నటించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, శోభన, దిశా పటానీ తమ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. అదే విధంగా కీర్తి సురేష్ వాయిస్ కూడా కల్కికి హైలెట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ప్రేక్షకులు ఊహించని మరికొంత మంది స్టార్స్ కూడా ఉన్నారు.

దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ మూవీలో ఉన్నట్లు మూవీ ప్రకటించగా.. మృణాళ్ ఠాకూర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, కె.వి. అనుదీప్ తో పాటు ఫరియా అబ్దుల్లా కూడా ఇందులో నటించారు. వీరంతా కల్కిలో గెస్ట్ రోల్స్ ప్లే చేశారు. వీరు కూడా కథకు తగ్గట్టుగా నటించారు. ఇక సినిమాలో ఊహించని గెస్ట్ కనిపించడంతో ప్రేక్షకులు ఓకింత ఆశ్చర్యానికి గురవుతూనే.. మరో పక్క ఫుల్ ఖుషి అవుతున్నారు.

Tags

Next Story