Maharashtra : 4 ఏళ్ల చిన్నారిని కాలువలో పడేసిన 13ఏళ్ల బాలుడు

X
By - Manikanta |8 March 2024 5:11 PM IST
హృదయ విదారకమైన ఓ సంఘటనలో, మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో 13 ఏళ్ల బాలుడు 4 ఏళ్ల చిన్నారిని కాలువలో పడేశాడు. దీంతో చిన్నారి నీటిలో మునిగి, చనిపోయాడు. చిన్నారిని హసన్ మాలిక్ హుస్సేన్‌గా గుర్తించారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
పరారీ
ఈ బాధాకరమైన సంఘటన మార్చి 5 న నాసిక్‌లోని దాతర్‌నగర్‌లో జరిగింది. అక్కడే నివసిస్తున్న నిందితుడు బాల్య ఇతర పిల్లలతో ఆడుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ఓ వైరల్ వీడియోలో ఘటనా స్థలం నుంచి పారిపోయే ముందు నిందితుడు చిన్నారిని కాలువలో పడేసినట్లు ఉంది.
ఎఫ్‌ఐఆర్ నమోదు
మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పవార్‌వాడి పోలీసు స్టేషన్‌లోని అధికారులు హత్య కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com