Indian Student : అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఓహియోలోని క్లీవ్‌లాండ్‌లో ఉమా సత్యసాయి గద్దె అనే తెలుగు విద్యార్థి చనిపోయాడు. అతని మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
భారత్‌లో సత్యసాయి కుటుంబానికి సమాచారం ఇచ్చామని పేర్కొంది. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించడానికి అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్లు వివరించింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసింది. మరణానికి గల కారణాలను వెల్లడించలేదు.
కాగా అమెరికాలో ఈ ఏడాది.. ఇప్పటివరకు 10 మంది భారత్/భారత సంతతి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మధ్యకాలంలో మృతి చెందిన భారతీయ విద్యార్థుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 10 మంది విద్యార్థులు వేర్వేరు కారణాలతో మరణించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com