Exams : ఎగ్జామ్ లో ఆన్సర్ చూపించలేదని కత్తితో దాడి

మహారాష్ట్రలోని (Maharashtra) థానే జిల్లాలోని భివాండి పట్టణంలో 10వ తరగతి పరీక్ష జరుగుతున్న సమయంలో, ముగ్గురు విద్యార్థులు తమ క్లాస్‌మేట్‌కు తన సమాధాన పత్రాన్ని చూపించడానికి నిరాకరించినందుకు అతనిని కత్తితో పొడిచారు. పరీక్ష అనంతరం పాఠశాల ఆవరణలో మార్చి 26న గొడవ జరిగింది. గాయపడిన విద్యార్థిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు ధృవీకరించారు.
"ఎస్‌ఎస్‌సి పరీక్షల సమయంలో, బాధితుడు తన జవాబు పత్రాన్ని పరీక్ష సమయంలో నిందితులకు చూపించడానికి నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తులైన ముగ్గురూ పరీక్ష హాల్ నుండి బయటకు రాగానే అతన్ని పట్టుకుని కొట్టారు. ఆ తర్వాత వారు అతన్ని కత్తితో పొడిచారు. ఈ కారణంగా అతను గాయడి, ఆసుపత్రిలో చేర్చబడ్డాడు" అని ఒక పోలీసు అధికారి తెలిపారు. అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపారు.
ముగ్గురు మైనర్ నిందితులపై భివాండిలోని శాంతి నగర్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 324 (ప్రమాదకరమైన ఆయుధాలు లేదా మార్గాల ద్వారా స్వచ్ఛందంగా గాయపరచడం) కింద కేసు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com