Home Guard : విధులకు వెళ్తూ.. హోంగార్డు మృతి

Home Guard : విధులకు వెళ్తూ.. హోంగార్డు మృతి
X

వరంగల్​ జిల్లాలో విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఓ హోంగార్డు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మామునూరు 4వ బెటాలియన్​ ​లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు వడ్డేపల్లి సుధాకర్ విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో వరంగల్–- ఖమ్మం జాతీయ రహదారి మామునూరు జ్యోతిబా పూలే పాఠశాల ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను ముక్కలు ముక్కలయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Tags

Next Story