Road Accident : అంత్యక్రియలకు వెళ్తుండగా యాక్సిడెంట్.. దంపతులు మృతి

Road Accident : అంత్యక్రియలకు వెళ్తుండగా యాక్సిడెంట్..  దంపతులు మృతి
X

సదాశివనగర్ (కామారెడ్డి), వెలుగు: బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు స్కూటీపై వెళ్తున్న దంపతులను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఇద్దరూ చనిపోయారు. ఈ ప్రమాదం కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్​మండలం పద్మాజీవాడి సమీపంలో హైవేపై సోమవారం జరిగింది. సదాశివ్ నగర్ మండల కేంద్రానికి చెందిన ఏనుగు జనార్దన్ రెడ్డి(47), భార్య ప్రతిభ (36) కలిసి బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు స్కూటీపై పద్మాజీవాడికి వెళ్తున్నారు.

గ్రామానికి కొద్ది దూరంలో యూటర్న్ సమీపంలో వీరి స్కూటీని వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రతిభ స్పాట్ లోనే చనిపోగా జనార్దన్ రెడ్డి గాయపడ్డారు. గమనించిన స్థానికులు జనార్దన్ రెడ్డిని కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్​లోని ప్రైవేట్ హాస్పిటల్ తరలించగా ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. మృతుడి తల్లి సత్తవ్వ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ సంతోష్ కుమార్ చెప్పారు.

Tags

Next Story