Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం .. 9మంది స్పాట్ డెడ్

Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం ..  9మంది స్పాట్ డెడ్
X

ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెమెతరలో ఆగివున్న వ్యాన్ ను ఢీకొట్టింది కారు. ఈ ప్రమాదంలో ఐదుగురు స్పాట్ లో మృతి చెందారు. చికిత్స పొందుతూ మరో నలుగురు చనిపోయారు. మరో 23 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు కలెక్టర్ రణ్ వీర్ శర్మ. తర్వాత బాధితులను పరామర్శించారు.

మృతులను పాతర్రా గ్రామానికి చెందిన భూరి నిషాద్ (50), నీరా సాహు (55), గీతా సాహు (60), అగ్నియా సాహు (60), ఖుష్బు సాహు (39), మధు సాహు (5), రికేశ్ నిషాద్ (6), ట్వింకిల్ నిషాద్ ( 6)లుగా గుర్తించినట్లు తెలిపారు. బీజేపీ ఎంపీ దీపేష్ సాహు క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రిని సందర్శించి వారిని పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags

Next Story