Accident : వాహనం అదుపు తప్పి నలుగురు మృతి

Accident : వాహనం అదుపు తప్పి నలుగురు మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని (Jammu Kashmir) రాంబన్ జిల్లాలోని ఉఖ్రాల్‌లోని మాలిగామ్ సమీపంలో ఈ రోజు ఉదయం వాహనం అదుపుతప్పి రోడ్డుపై నుంచి దూసుకెళ్లడంతో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మాలిగాం నుంచి ఉఖ్రాల్‌కు వెళ్తున్న వాహనం మాలిగాం సమీపంలో అదుపు తప్పి పడిపోయింది.

ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని, ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి నాలుగు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన ముగ్గురిని పీహెచ్‌సీ ఉఖ్రాల్‌కు తరలించారు. మృతులు అబ్దుల్ వాహిద్ బాలి, అనయతుల్లా, మహ్మద్ అయూబ్ బాలి, డ్రైవర్ సజ్జాద్ అహ్మద్- అందరూ జమ్మూ కాశ్మీర్‌లోని పోగల్ గ్రామ నివాసితులుగా గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story