Maharashtra : మహారాష్ట్రలో దారుణం... ప్రసాదం తిని 500 మందికి అస్వస్థత ..

మతపరమైన కార్యక్రమంలో పంచిన ప్రసాదం తినవడంతో సుమారు 500 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని (Maharashtra) బుల్దానా జిల్లాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వీరందరినీ స్థానిక ఆస్పత్రికి తరలిం చారు. ఆస్పత్రిలో సరిపడినన్ని పడకలు లేకపోవడంతో ఆరుబయటే రోడ్డుపై చెట్లకు తాళ్లు కట్టి సెలైన్లు వేలాడదీసి చికిత్స అందించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి.
జిల్లాలోని సోమ్రానా గ్రామంలో హరినామ్ శపథ్ పేరిట గత వారంనుంచి మతపరమైన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళవారం సోమ్దనా, ఖాపర్కేడ్ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. రాత్రి 10 గంటల సమయంలో వీరు ప్రసాదం స్వీకరించారు. కొద్దిసేపటి తర్వాత అస్వస్థతకు గురయ్యారు.
వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. కడుపునొప్పి, వాంతులతో ఇబ్బం దులు పడినట్లు బుల్దానా కలెక్టర్ కిరణ్ పాటిల్ తెలిపారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలక "డగానే ఉందని, కొందరిని డిశ్చార్చి చేసినట్లు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com