Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. యాదగిరిగుట్ట విద్యార్థిని మృతి

Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. యాదగిరిగుట్ట విద్యార్థిని మృతి
X

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరో యువతి దుర్మరణం పాలైంది. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికి చెందిన గుంటిపల్లి సౌమ్య (25) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది.

అక్కడ అట్లాంటిక్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. సౌమ్య చదువుతోపాటు పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తోంది. ఆదివారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) రోడ్డుపై నడుచు

కుంటూ వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కారు ఆమెను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సౌమ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అమెరికాలోని తెలుగు సంఘాలు, భారతరాయభార సంస్థలు ఏర్పాట్లు చేశారు. సౌమ్య మృతి చెందిన సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో యాదగిరిపల్లి గ్రామం లో విషాదఛాయలు అలముకున్నాయి.

Tags

Next Story