New Jersey : అమెరికాలో కాల్పులు.. NRI మహిళ మృతి

New Jersey : అమెరికాలో కాల్పులు.. NRI మహిళ మృతి
X

అమెరికాలోని ( America ) న్యూ జెర్సీలో ( New Jersey ) ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాల్పులు జరిపిన దుండగుడు, కాల్పుల్లో చనిపోయిన మహిళ సహా పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారే అని అధికారులు తెలిపారు.

బాధిత మహిళలు ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. వారితో నిందితుడికి ఇండియాలోనే పరిచయం ఉందని సమాచారం. ఈ నెల 14న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. న్యూజెర్సీ రాష్ట్రంలోని మిడిల్ సెక్స్ కౌంటీ లో రోడ్డు పక్కన నడుస్తున్న అక్కాచెల్లెళ్ల పై నిందితుడు చాలా దగ్గరి నుంచి కాల్పులు జరిపి పారిపోయాడు. భారత సంతతికి చెందిన పంజాబీ మహిళ జస్వీర్ కౌర్ (29) అక్కడికక్కడే చనిపోగా, ఆమె సోదరి (20) కి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే వారిని ఆసుప్రత్రికి తరలించారు. అయితే.. అప్పటికే జస్వీర్ కౌర్ చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఆమె సోదరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. కాల్పులు జరిపిన యువకుడు గౌరవ్ గిల్ ను పోలీసులు అరెస్టు చేశారు.పంజాబ్ లో జస్వీర్ సోదరి, తాను కలిసి చదువుకున్నట్లు వెల్లడించాడు. కాల్పులకు కారణమేంటనే విషయం బయటపడలేదు.

Tags

Next Story