Teacher Death : హోటల్ రూమ్ లో టీచర్ అనుమానాస్పద మృతి

Teacher Death : హోటల్ రూమ్ లో టీచర్ అనుమానాస్పద మృతి

సిటీలోని ఓ హోటల్లో ఏపీకి చెందిన టీచర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. మియాపూర్ పోలీసులు తెలిపిన ప్రకారం.. ఏపీలోని అన్నమయ్య జిల్లా కొత్తపేట మండలం రాయచోటికి చెందిన ప్రభుత్వ టీచర్ జయప్రకాశ్ నారాయణ్ (35), ఈనెల 22న కూకట్ పల్లి బాలాజీనగర్ లోని తన సోదరి ఇంటికి వచ్చాడు. శనివారం ఉదయం ఊరికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయాడు. రాత్రి అయినా ఇంటికి చేరకపోవడంతో జయప్రకాష్ సోదరి కూకట్ పల్లి పీఎస్ లో కంప్లైంట్ ఇచ్చింది.

పోలీసులు దర్యాప్తు చేయగా.. శనివారం మధ్యా హ్నం జయప్రకాష్ మియాపూర్ మదీనాగూడ లోని ఫ్లాగ్ షిప్ ఓయో వెన్నెల రెసిడెన్సీ లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం అయినా హోటల్ గది నుంచి అతను బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది వెళ్లి చూడడంతో బెడ్ పై చనిపోయి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

నారాయణ్ (ఫైల్) ఘటనా స్థలానికి వెళ్లి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. అనుమా నాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.జయప్ర కాష్ నారాయణ్ కొంత కాలంగా ఫిట్స్ తో బాధ పడుతుండగా ఆయుర్వేదిక్ మందులు వాడుతు న్నాడు. ఫిట్స్ కారణంగా మృతి చెందాడా..? లేక ఆత్మహత్య చేసుకొని ఉంటాడా..? అనే కోణంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story