AP : లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన వీఆర్వో

లంచం తీసుకుంటూ ఓ వీఆర్ ఓ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికి పోయాడు. తిరుపతి జిల్లా (Trupati District) కెవీవి పురం మండలం (KVV Mandal), కర్లపూడి (Karlapudi) గ్రామానికి చెందిన చెంజి శేఖరికి తన పెదనాన్న పేరున ఉన్న డి-పట్టా భూమిని అతనికి, అతని సోదరుని పేర్లపై బదిలీ చేయడంతోపాటు సదరు భూమిలో బోర్వెల్ కు విద్యుత్ కనెక్షన్ కోసం సర్టిఫికెట్ జారీ చేయాలని కోరుతూ తిరుపతి జిల్లా కెవిబి పురం మండలం కోవనూరు గ్రామ విఆర్ ఓ వి.మునిరాజాను సంప్రదించాడు.
దీంతో వీఆర్డీఓ ఐదు వేలు లంచం డిమాండు చేయగా, బాధితుడు ఏసీవిని ఆశ్రయిం చిన ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన అధికారులు విఆర్డీఓ మునిరాజాను కెవిబిపురంలో పిచ్చటూరు కాళహస్తి రోడ్లో ఉన్న అయ్యప్ప కూల్ డ్రింక్ షాపులో రూ. 5వేలు బాధితుని వద్ద నుండి లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుసా మని అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com