Ongole : టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్య

ఒంగోలులో దారుణం జరిగింది. టీడీపీ అధికార ప్రతినిధి, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఆయన ఇవాళ ఒంగోలు పద్మ టవర్స్‌లోని ఆఫీసులో ఉండగా, ముగ్గురు వ్యక్తులు ముసుగులతో ప్రవేశించి ఘాతుకానికి పాల్పడ్డారు. దుండగులను బిహార్ గ్యాంగ్‌గా అనుమానిస్తున్నారు. వీరయ్య చౌదరి మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య వార్త తెలుసుకుని మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒంగోలులోని తన కార్యాలయంలో వీరయ్య చౌదరిని దుండగులు అంత్యత కిరాతకంగా నరికి చంపడం దారుణం అన్నారు. యువగళం పాదయాత్రలో తనతోపాటు అడుగులు వేసిన వీరయ్య చౌదరి పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసారని మంత్రి లోకేష్ గుర్తు చేసుకున్నారు. హంతకులపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించామని.. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com