Cannabis : ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి
ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ, చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర షోలాపూర్ బ్రహ్మపురి గ్రామానికి చెందిన బోంస్లే ఆబా మచ్చీంద్ర అలియాస్ అబా (29), షోలాపూర్ సౌత్‌కు చెందిన అవినాష్ శివాజీ రాఽథోడ్(19), షోలాపూర్ సౌత్ పాషానగర్‌కు చెందిన సిద్దరామేశ్వర్ పూజారి అలియాస్ సిద్దూ(27) స్నేహితులు. 10వ తరగతి వరకు చదువుకుని డ్రైవర్లుగా పనిచేస్తున్నారు.
వీరికి షోలాపూర్‌కు చెందిన గంజాయి విక్రేత అజయ్ రాథోడ్‌తో పరిచయం ఏర్పడింది. అజయ్ డబ్బు, వాహనాలు సమకూర్చితే ఈ ముగ్గురు ఒడిశా అలూరి కోటకు చెందిన తేజ నుంచి గంజాయి కొనుగోలు చేసి షోలాపూర్‌కు తీసుకొచ్చి అధిక ధరకు విక్రయిస్తున్నారు. గంజాయి కొనుగోలు చేసేందుకు అజయ్ రాథోడ్ డబ్బులు, కార్లు (స్విఫ్ట్ డిజైర్, ఇన్నోవా) సమకూర్చాడు.
రెండు కార్లలో ఒడిశా వెళ్లిన ముగ్గురు నిందితులు 280 కిలోల గంజాయిని తీసుకొని విజయవాడ, ఖమ్మం, హైదరాబాద్ మీదుగా షోలాపూర్ వెళ్తున్నారు. వీరి దందాపై పక్కా సమాచారమందుకున్న ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ, చౌటుప్పల్ పోలీసులు పంతంగి టోల్‌గేట్ వద్ద కార్లను తనిఖీ చేశారు. రెండు కార్లు, 280 కిలోల గంజాయి, మూడు మొబైల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com