Firecracker Factory : పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు..8 మంది మృతి

X
By - Manikanta |17 Feb 2024 5:38 PM IST
తమిళనాడు విరుదునగర్ జిల్లాలోని ఓ టపాకుల ఫ్యాక్టరీలో భారీపేలుడు సంభ వించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డా రు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్లు సమాచారం. వెంబకొట్టై సమీపంలోని రాముదేవన్పట్టిలోని ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది.
ఈ పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సర్వీస్ వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com