Crime : ప్రియుడి మోజులో పిల్లలకు విషం.. ఓ తల్లి ఘాతుకం

కన్నపేగును కాదనుకున్న కసాయి తల్లి. ప్రియుడు మోజులో పడి కన్న బిడ్డలు తమ ఆనందానికి అడ్డిస్తున్నారన్న నెపంతో కూల్ డ్రింక్లో విషం కలిపి ఇద్దరి పిల్లలకు ఇచ్చిన విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ మండలంలోని జోగ్య తండాలో చోటుచేసుకుంది. ఈ ఘటన లో చిన్నారి నిత్యశ్రీ మృతిచెందింది. దీంతో ఆదివారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మహబూబాబాద్ నుండి ఖమ్మం వెళ్లే ప్రధాన రహ దారిపై చిన్నారి నిత్యశ్రీ మృతదేహంతో బంధువులు, గ్రామస్తులు నిందితురాలు కాల్ డేటా తీసి హత్య కుట్రదారులను వెంటనే గుర్తించాలని ధర్నా చేపట్టారు. రోడ్డుకి అడ్డంగా ముండ్ల కంప వేసి, రాత్రంతా రోడ్డుపైనే ఆందోళన చేస్తూ కన్నతల్లి ఉష తన బిడ్డ నిత్యశ్రీ మృతదేహంతో గ్రామానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఆమె వచ్చే వరకు అంతక్రియలు జరిపేది లేదని పట్టుబట్టారు. ఇద్దరు చిన్నారులను తల్లి ఎందుకు చంపాలనందుకుంది? ఇందులో ఎవరి పాత్ర ఉందో తేల్చాలని నిలదీశారు. అదేవిధంగా గత నాలుగు నెలల క్రితం నిందితురాలి భర్త మృతిపై కూడా అనుమానం ఉందని తండవాసులు పేర్కొన్నారు. దీనితో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. చివరికి గ్రామస్తులు, బంధువులతో సీఐ రాజేష్, బయ్యారం సీఐ రవికుమార్, ఎస్ఐలు, స్థానిక ముఖ్య నాయకులు నిందితురాలు ఉషతో పాటు ఈ ఘటనకు సంబంధించినవారు ఇంకా ఎవరైనా ఉన్నా పూర్తి స్థాయిలో విచారించి చట్టపర్యమైన చర్యలు తీసుకుంటామని, నిందితులకు శిక్షపడేలా చూస్తామని, వరుణ్ తేజ్ భవిష్యత్తు కోసం స్థానిక ఎమ్మెల్యే చొరవతో ఆయన చదువుల కోసం, ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. అనంతరం మృతిచెందిన చిన్నారి నిత్యశ్రీ అంతక్రియలను నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com