Tragic : దారుణం... ప్రేమలో ఉందని కూతురికి ఉరేసి చంపిన తల్లి

కూతురు ఓ అబ్బాయిని ప్రేమించి, అతనితోనే పెళ్లికి సిద్ధపడిందని కన్న తల్లే చీరతో ఉరేసి చంపేసింది. రంగారెడ్డి జిల్లాలోని దండుమైలారంలో సోమవారం ఈ ఘటన జరిగింది. దండుమైలారం గ్రామానికి చెందిన మోటె జంగమ్మ, అయిలయ్యల కూతురు భార్గవి(19) అదే గ్రామానికి చెందిన శేషు ప్రేమలో ఉన్నారు.
ఇది నచ్చని భార్గవి తల్లిదండ్రులు ఆమెకు మరో పెళ్లి సంబంధం చూస్తున్నారు. సోమవారం ఉదయం జంగమ్మ పొలం పనికి వెళ్లగా.. అయిలయ్య కర్మన్‌ఘాట్‌లో తాను పనిచేసే రైస్ మిల్లుకు వెళ్లాడు. ఈ సమయంలో భార్గవి వాళ్ల ఇంటికి శేషు వచ్చాడు. అప్పుడే పొలం నుంచి వచ్చిన జంగమ్మ ఇద్దరిని మందలించింది.
శేషు అక్కడ నుంచి వెళ్లిపోయాక జంగమ్మ భార్గవిపై ఆగ్రహంతో ఊగిపోయింది. కోపంలో భార్గవి మెడకు చీర చుట్టి ఉరేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భార్గవి సోదరుడు చరణ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com