Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరిలోఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. దిండోరిలోని బద్‌జర్ ఘాట్ వద్ద పికప్ వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన వారిలో 6 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ స్పందించారు. మరణించిన వారికి సీఎం సంతాపం ప్రకటించారు. ఈ దరువార్తను తట్టుకునే శక్తిని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని, మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

మరణించిన వారి కుటుంబాలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ ఘటనలో గాయపడిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి సంపాటియా ఉయికే దిండోరికి చేరుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story