రైళ్లలో వాటర్ బాటిళ్ల బిజినెస్ లో గొడవ.. ఇద్దరి హత్య

రైళ్లల్లో వాటర్ బాటిల్స్ (Train Water Bottles) అమ్మే వ్యాపారంలో గొడవలు హత్యల వరకు వెళ్లాయి. ముగ్గురు వ్యక్తులు, మరో ఇద్దరిని దారుణంగా హతమార్చారు. మహారాష్ట్రలో (Maharashtra) ఈ దారుణం జరిగింది.
థానే ప్రాంతంలో బాధితులు, నిందితులు.. రైళ్లల్లో మంచి నీటి సీసాలు అమ్ముకుంటూ జీవితాన్ని సాగిస్తున్నారు. ఆ వ్యాపారం విషయంలో ఆ ఐదుగురి మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. ఆ తర్వాత మర్డర్ లు జరిగాయని ఆలస్యంగా తెలిసింది.
ఫిబ్రవరి 3న.. ఓ వ్యక్తి మృతదేహాన్ని వైతరణి నదిలో గుర్తించారు పోలీసులు. ఫిబ్రవరి 6న కసర ఘాట్లో (Kasara Ghat) పోలీసులకు మరో మృతదేహం కనిపించింది. ఈ రెండు మృతదేహాలకు లింక్ ఉందని తెలుసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. మరణించిన వారిలో ఒకరి చేతిపై టాటూలు ఉన్నాయి. మృతుడు.. 25ఏళ్ల దీపక్ థోకే అని పోలీసులు గుర్తించారు. రైళ్లల్లో వాటర్ బాటిల్స్ అమ్ముకునే మరికొందరితో అతనికి విభేదాలు ఉన్నాయని తెలిసింది. అలా.. నిందితులు 38ఏళ్ల పెంట్యా చిటారి, 22ఏళ్ల సైకుమార్ కదామచి, 29ఏళ్ల కిషోర్ శెత్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసులో నాలుగో నిందితుడు కూడా ఉన్నాడని, పరారీలో ఉన్న అతడిని త్వరలోనే పట్టుకుంటామన్నారు ఇక్కడ క్లిక్ చేయండి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com