Ram Mandir : రామమందిరానికి రోజూ దాదాపు 1.5 లక్షల మంది యాత్రికులు

Ayodhya : అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామమందిరానికి రోజూ సగటున 1.5 లక్షల మంది యాత్రికులు వస్తున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం తెలిపింది. ఈ ఆలయాన్ని జనవరి 22, 2024న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. జనవరి 23న మొదటిసారిగా సాధారణ ప్రజలకు ఆలయ తలుపులు తెరిచారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం తన అధికారిక Xలో, "శ్రీరామ జన్మభూమి మందిర్‌కు ప్రతిరోజూ సగటున 1 నుండి 1.5 లక్షల మంది యాత్రికులు వస్తుంటారు" అని తెలియజేసింది.
మీరు అయోధ్యకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నట్టియితే గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన నియమాలు, నిబంధనలు:
ట్రస్ట్ ప్రకారం, భక్తులు దర్శనం కోసం మందిరంలోకి ఉదయం 6:30 నుండి రాత్రి 9:30 వరకు ప్రవేశించవచ్చు. "శ్రీరామ జన్మభూమి మందిర్‌లో దర్శనం తర్వాత ప్రవేశం నుండి నిష్క్రమణ వరకు మొత్తం ప్రక్రియ చాలా సరళంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. సాధారణంగా, భక్తులు ప్రభు శ్రీరామ్ లల్లా సర్కార్‌ను 60 నుండి 75 నిమిషాలలోపు సాఫీగా దర్శనం చేసుకోవచ్చు" అని ఆలయ ట్రస్ట్ తెలిపింది.
భక్తులు తమ సౌకర్యార్థం, సమయాన్ని ఆదా చేసుకునేందుకు తమ మొబైల్ ఫోన్లు, పాదరక్షలు, పర్సులు తదితరాలను మందిరం వెలుపలే ఉంచాలని ట్రస్టు సూచించింది.
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరాన్ని సందర్శించినప్పుడు, ఆలయానికి పువ్వులు, దండలు, ప్రసాదాలు మొదలైనవి తీసుకురావద్దని సలహా ఇచ్చారు.
ఎంట్రీ పాస్ కోసం భక్తుడి పేరు, వయస్సు, ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ మరియు నగరం వంటి సమాచారం అవసరం.
ఈ ఎంట్రీ పాస్‌ను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెబ్‌సైట్ నుండి కూడా పొందవచ్చు. ఎంట్రీ పాస్ ఉచితం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com