Amarnath Yatra : రేపటి నుంచి అమర్ నాథ్ యాత్ర

Amarnath Yatra : రేపటి నుంచి అమర్ నాథ్ యాత్ర
X

అమర్ నాత్ యాత్ర శనివారం నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. యాత్రను దృష్టిలో ఉంచుకుని పరమశివుడుని గుడిని అలంకరించారు. ప్రయాణికులకు ఆహారం, పానీయాల నుంచి ఇతర సౌకర్యాల వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.

శుక్రవారం తొలి బ్యాచ్ ప్రయాణికులు బయలుదేరుతారు. వారి కోసం పహల్గమ్ బాల్తాల్ లో రెండు బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుండి ప్రతిరోజూ 15 వేల మంది యాత్రికులు గుహను సందర్శించడానికి అనుమతిస్తారు. ట్రాన్సిట్ క్యాంపులో ప్రతిరోజూ 9 వేల మందికి పైగా ప్రయాణికులకు వసతి, ఆహారం అందించడానికి చర్యలు తీసుకున్నారు.

అమర్ నాథ్ యాత్ర కోసం ఈసారి కూడా వేలాది మంది భక్తులు వస్తారని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారికి తగ్గట్టుగా అన్ని సేఫ్టీ చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.

Tags

Next Story