Ayodhya : ఇవ్వాళ మ.12 గంటలకు అయోధ్యలో అద్భుతం

శ్రీరామ నవమి సందర్భంగా ఇవ్వాల మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్యలో అరుదైన ఘట్టం జరగనుంది. బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం ఆవిష్కృతం కానుంది. 75MM వ్యాసార్ధంతో దాదాపు 6 నిమిషాలపాటు సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ప్రక్రియను నిన్న నిర్వాహకులు విజయవంతగా పరీక్షించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA), సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CBRI) ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశాయి. ఈ అపురూప ఘట్టాన్ని భక్తులు వీక్షించేందుకు ఆలయ ప్రాంగణంలో దాదాపు 100 LED స్క్రీన్లను ఏర్పాటు చేశారట.
మరోవైపు శ్రీరామనవమి రోజున అయోధ్య బాలరాముడి దర్శనంపై ఆలయ ట్రస్ట్ కీలక ప్రకటన చేసింది. ఈ రోజు తెల్లవారుజామున ఉదయం 3.30 గంటలకు మంగళహారతితో ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు మందిరం తెరిచి ఉంటుందని పేర్కొంది. రామనవమి నేపథ్యంలో భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని ట్రస్ట్ సభ్యులు అంచనా వేస్తున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని స్పెషల్ పాస్ బుకింగ్స్ రద్దు చేశారు. విశిష్ట అతిథులు ఎవరైనా ఉంటే ఏప్రిల్ 19 తర్వాత రావాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com