Ayodhya : అయోధ్య రామయ్యకు 1,11,111 కిలోల లడ్డూ

Ayodhya : అయోధ్య రామయ్యకు 1,11,111 కిలోల లడ్డూ

ఈ నెల 17న అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి. ఆ రోజున భక్తులకు ప్రసాదం పంచేందుకు యూపీలోని మీర్జాపూర్ దేవ్‌రహ హాన్స్ బాబా ట్రస్టు 1,11,111 కిలోల లడ్డూలను తయారు చేస్తోంది. త్వరలోనే వాటిని అయోధ్యకు పంపుతామని దేవ్‌రహా బాబా ట్రస్టుకు చెందిన ట్రస్టీ అతుల్‌ కుమార్‌ సక్సేనా వెల్లడించారు. కాశీ విశ్వనాథ్‌, తిరుపతి శ్రీవారి ఆలయంతో పాటు మరికొన్ని పుణ్యక్షేత్రాలకూ ట్రస్టు తరఫున ప్రతి వారం లడ్డూ ప్రసాదాన్ని పంపుతున్నట్లు ఆయన చెప్పారు. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ రోజున కూడా 40వేల కిలోల లడ్డూలను పంపినట్లు చెప్పారు.

అయోధ్యలో శ్రీరాముడి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. రామ్ లల్లా విగ్రహానికి ప్రత్యేక వస్త్రాలతో పాటు వేల క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని అలంకరించనున్నారు. అయోధ్య సిటీ వ్యాప్తంగా వందకు పైగా ఎల్ ఈడీ స్క్రీన్లను సిద్ధం చేస్తున్నారు. భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు 600 మీటర్ల మేర జర్మన్ హ్యాంగర్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

మరోవైపు అయోధ్యకు వీఐపీ భక్తులతో పాటు, సామాన్య భక్తుల తాకిడి కూడా విపరీతంగా ఉన్నట్లు సమాచారం. విమానం, రైల్వే, బస్సుల మార్గాల ద్వారా పెద్ద ఎత్తున భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా రామ్ లల్లాను దర్శించుకొవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story