TTD : బాబు ఎఫెక్ట్.. పెరగనున్న తిరుమల లడ్డూ టేస్ట్

నాణ్యమైన నెయ్యి, శెనగపిండి, యాలకులు ఉపయోగించి మరింత రుచికరంగా లడ్డూలశాంపిల్స్ తయారు చేసి, నాణ్యతను పరిశీలించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు పోటు కార్మికులను ఆదేశించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో శుక్రవారం లడ్డూ తయారీపై జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్ వో నరసింహకిషోర్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
లడ్డూ తయారీలో ఉన్న సమస్యలు, నాణ్యతా లోపంపై వస్తున్న విమర్శలకు గల కారణాలను ఈవో పోటు కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోటు కార్మికులు లడ్డూల తయారీలో వినియోగిస్తున్న శెనగపిండి, నెయ్యి, యాలకుల నాణ్యతను పెంపొందించాలని అభిప్రాయ పడ్డారు. అంతే కాకుండా పని భారం పెరిగిపోవడంతో అదనపు సిబ్బందిని తదనుగుణంగా నియమించాలని వారు ఈఓకు విన్నవించారు.
అధికారులు, పోటు కార్మికుల సల హాలు, సూచనలు విన్న తరువాత ఈవో మాట్లాడుతూ అత్యంత నాణ్యమైన నెయ్యి మరియు ఇతర పదార్థాలను ఉపయోగించి రుచికరమైన లడ్డూల నమూనాలను తయారు చేసి రుచి, నాణ్యతను పరిశీలించాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com