Bhadrachalam : భద్రాద్రిలో జులై 2 నుంచి బ్రేక్ దర్శనం: ఆలయ ఈవో రమాదేవి

Bhadrachalam : భద్రాద్రిలో జులై 2 నుంచి బ్రేక్ దర్శనం: ఆలయ ఈవో రమాదేవి
X

భద్రాచలం రామాలయంలో జులై 2 నుంచి బ్రేక్ దర్శనం అమల్లోకి రానుంది. ఇందుకు టికెట్ ధర రూ.200గా నిర్ణయించారు. ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 7.30 గంటల వరకు బ్రేక్ దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఆ సమయంలో ఉచిత, ప్రత్యేక దర్శనంతో పాటు ఇతర సేవలు నిలిపివేస్తామని పేర్కొన్నారు. అలాగే మెయిన్‌‌ టెంపుల్‌‌, అన్నదాన సత్రంలో 90 కిలోవాట్ల కెపాసిటీ కలిగిన సోలార్‌‌ విద్యుత్‌‌ ప్లాంట్‌‌ను ఈవో ప్రారంభించారు.

మరోవైపు దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం క్షేత్రంలో దశాబ్దకాలంగా రామనారాయణపై వివాదం కొనసాగుతోంది. సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల తరుణంలో చర్చ తెరమీదకు వస్తుంది. భద్రాద్రిలో జరిగేది శ్రీరామకల్యాణమా లేక లక్ష్మీనారాయణుల కల్యాణమా అంటూ కొంతమంది ప్రశ్నిస్తుండటం చర్చకు దారి తీస్తోంది. దశాబ్ద కాలంలో ఎన్నోసార్లు ఈ విషయం శ్రీరామనవమి ముందు తెరపైకి రావటం, తర్వాత తెరమరుగు కావటం ఏటా జరుగుతోంది.

Tags

Next Story