Kartika Purnima : మహారాష్ట్ర నుంచి భక్తులు..గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు

Kartika Purnima : మహారాష్ట్ర నుంచి భక్తులు..గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు
X

కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకుని భక్తులు గోదావరి నది లో పుణ్య స్నానాలు ఆచరించారు. శుక్రవారం కార్తీక పౌర్ణమి మంచి రోజు కావడంతో భక్తులు గోదావరి లో పవిత్ర స్నానాల కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంచిర్యాల పరిసర ప్రాంతాలతో పాటు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాతోపాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర సరి హద్దు గ్రామాల నుంచి భక్తులు తెల్లవారుజాము నుంచి గోదావరి బాట పట్టారు. నదిలో దీపాలు వదిలిపెట్టి ఇసుకతో సైకథ లింగాలు రూపొందించి పూజలు చేశారు. పుణ్య స్నానాలు చేసిన తర్వాత నది తీరంలో కొలువుతీరిన గౌతమేశ్వర ఆలయంలో దేవుళ్ళను దర్శనం చేసుకున్నారు. స్నానాల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం పంపిణీ చేశారు. విశ్వనాథ ఆలయంలో కూడా భక్తుల తాకిడి పెరిగింది. ఆలయంలో దైవ దర్శనం చేసుకుని వత్తులు వెలిగించారు.

Tags

Next Story