Bhadrachalam : భద్రాచలంలో వృద్ధులకు నేరుగా దర్శనం

Bhadrachalam : భద్రాచలంలో వృద్ధులకు నేరుగా దర్శనం
X

భద్రాచలం శ్రీరామచంద్రస్వామి దర్శనాలకు EO కొత్త విధానాలను ప్రవేశపెట్టారు. ఇకపై 60ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లులు, వారికి సాయంగా వచ్చేవారు నేరుగా దర్శించుకోవచ్చు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు బేడా మండపంలో వేచి ఉండేందుకు వీరికి సదుపాయాలు కల్పిస్తారు. ప్రొటోకాల్ అర్హత ఉన్నవారి కోసమూ ఏర్పాట్లు చేశారు. ఆలయ ఆఫీసులో వివరాలు అందించి కోరుకున్న దర్శనం, పూజ చేయించుకోవచ్చు.

ప్రముఖులకు ప్రొటోకాల్‌ దర్శనం.. వృద్ధులు, నడవలేని వారు, చంటిపిల్లల తల్లులు నేరుగా స్వామి దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టారు. ముఖ్య ఉత్సవాలు, విశేష రోజుల్లో రద్దీని అనుసరించి వీటిలో మార్పులు ఉండవచ్చని ఈ సందర్భంగా ఈవో తెలిపారు. ఆలయంలో ఫిర్యాదుల పెట్టెలు అందుబాటులో ఉంచామని, భక్తులు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలిపితే పరిశీలించి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తామని వెల్లడించారు.

అటు వృద్ధులకు, దివ్యాంగులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీనివాసుడి దర్శనం కోసం వచ్చే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా వేంకటేశ్వరస్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. వృద్ధులు, దివ్యాంగుల కోసం రోజులో ఒకసారి ప్రత్యేక స్లాట్‌ను ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వనుంది

Tags

Next Story