Vijayawada Kanaka Durga Temple : ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి నవరాత్రులు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. జులై 6 నుంచి 15వ తేదీ వరకు ఉత్సవాలు ఉంటాయని ఈవో రామారావు తెలిపారు. లోక కళ్యాణార్థం పండితుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిత్యం చండీపారాయణ, రుద్రపారాయణలు, ఉదయం, సాయంత్రం పూజాహారతి, మంత్రపుష్పాలు నివేదన చేస్తారన్నారు. 15న పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని చెప్పారు.
పంచ వారాహి మంత్రాలు, చండీ, రుద్రహోమాలు నిర్వహిస్తామని తెలిపారు. లోక కల్యాణార్థం పండితుల సూచనల మేరకు ఈ నవరాత్రి ఉత్సవాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈఓ వివరించారు. నిత్యం చండీపారాయణ, రుద్రపారాయణలు, ఉదయం, సాయంత్రం పూజాహారతి, మంత్రపుష్పాలు నివేదన చేస్తారని తెలిపారు.
జులై 14న మహంకాళి ఉత్సవ కమిటీ బోనాల సమర్పణ ఉంటుందని.. మహా నివేదన సమయంలో భక్తుల రద్దీ భారీగా ఉండే అవకాశం ఉందని.. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ప్రోటోకాల్ దర్శనాలు ఉండవని తెలిపారు. ఈ క్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని బెజవాడ దుర్గ గుడి ఈవో ఆదేశాలు జారీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com