Kondagattu Temple : కొండగట్టుపై భారీ రద్దీ.. స్వాముల రాకతో సందడి

Kondagattu Temple : కొండగట్టుపై భారీ రద్దీ.. స్వాముల రాకతో సందడి
X

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రంలో హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు రాష్ర్ట నలుమూల నుంచి దీక్షా పరులు వచ్చారు.

హనుమాన్ స్వాములు పెద్దసంఖ్యలో మాల విరమణ చేస్తున్నారు. ఉదయం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూలైన్లు నిండిపోయాయి. రేపు శనివారం హనుమాన్‌ జయంతి కాగా ఈ రోజు సాయంత్రం నుంచి భక్తుల రద్దీ మరింత పెరగనుంది.

ఉత్సవాల సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. లోక కల్యాణం కోసం నిత్య హోమం జరుగుతోంది. స్వామి పాటల పారాయణం చేస్తున్నారు. కొండపై ప్రత్యేక అలంకరణ చేశారు.

Tags

Next Story