Hanuman Jayanti : హనుమాన్ జయంతి.. కొండగట్టుకు భారీగా భక్తులు

హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. మాల విరమణ కోసం భారీ సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ రామ జయరామ జయ జయ రామ నామ స్మరణతో మార్మోగుతోంది. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి ఉదయాన్నే కోనేటిలో స్నానం ఆచరిస్తున్నారు.
వేకువజాము నుంచే ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీక్షాపరులు స్వామి వారి సన్నిధిలో దీక్షా విరమణ చేస్తున్నారు. అర్థరాత్రి నుంచి సుమారు 50 వేల మంది దీక్షాపరులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. 22న ప్రారంభమైన ఈ ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
హనుమాన్ జయంతి అంటే హనుమంతుడి పుట్టినరోజు. హిందూ మతంలో హనుమాన్ జయంతికి చాలా విశిష్టమైన స్థానం ఉంటుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం హనుమాన్ జయంతి ఏప్రిల్ 23 తెల్లవారుజామున 3 గంటల 25నిమిషాలకు ప్రారంభమై, ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 5 గంటల 18నిమిషాలకు ముగుస్తుంది. హనుమాన్ జయంతి రోజు ఎవరైతే హనుమంతుడిని విశేషంగా పూజిస్తారో వారికి శుభాలు జరుగుతాయని, ఆరోగ్యం ఉంటుందని చెబుతున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com