Pooja Room : పూజ గదిలో ఇవి ఉంటే శని తెచ్చుకున్నట్లేనా..?

Pooja Room : పూజ గదిలో ఇవి ఉంటే శని తెచ్చుకున్నట్లేనా..?

కొత్త ప్రాంతాలకు, బయటకు వెళ్లిన వాళ్లు కొత్త వస్తువులు ఇంటికి కొనుక్కొస్తుంటారు. ఏది తెచ్చినా.. కొన్ని వస్తువులను పూజ గదిలో అస్సలు పెట్టకూడదు. అలా పెడితే శనిని స్వాగతించినట్టేనని చెబుతున్నారు పండితులు. షాపుల్లో మనం కొనే వస్తువు అనేది మన ఇంటికి కలిసి వస్తుందా..? రాదా..? అనే ప్రకారం ఆలోచించి కొనుక్కోవాలి అంటున్నారు పండితులు.

ప్రతి ఉదయం శుభ్రతగా ఇల్లు వాకిలి శుభ్రపరచుకొని.. సూర్యోదయం కన్నా ముందే లేచి దీపం వెలిగించాలి. హిందూ సాంప్రదాయ ప్రకారం సంసారం చేసే ఇళ్లల్లో కొన్ని కొన్ని దేవుడి ఫోటోలు ఉండకూడదు. ఆ దేవుడి ఫోటోలు ఉంటే నిష్ట నియమాలతో ఉండాలి. అయితే కొంతమంది కొన్ని ఫొటోస్.. కొన్ని ప్రమిదలు.. కొన్ని విగ్రహాలు కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారే తప్పిస్తే ఎక్కడా కూడా వాటికి పూజలు లాంటివి చేస్తూ ఉండరు. చేతికొచ్చింది కొనేసి దేవుడు గదిలో పెట్టేస్తూ ఉంటారు.

కొన్ని కొన్ని సార్లు మన టైం బాగోలేనప్పుడు అవి చాలా ప్రమాదకరంగా మారుతాయి అని మన జాతకాన్ని తలకిందులు చేసే శక్తి వాటికి ఉంటుంది అని పండితులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుడుకి సంబంధించి వస్తువులను మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే తాకాలి అని, మాంసాహారాలు తినేసి దేవుడు వస్తువులు అస్సలు టచ్ చేయొద్దని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story