Karthika Masam : కార్తీక పూజోత్సవాలు ప్రారంభం

శుక్రవారం నుంచి కార్తీక మాసంలో ప్రత్యేక దీపోత్సవాలు మొదలయ్యాయి. కోటి సోమవారం పూజ కావడంతో ప్రముఖ శివకేశవుల ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం పూజ అంటే సోమవారం వచ్చేది అని అందరూ అనుకుంటారు. ఐతే.. కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రం రోజున వచ్చే రోజునే కోటి సోమవారం అంటారు. ఈసారి శనివారం రావడంతో మరింత విశిష్టత ఏర్పడింది. వెంకటేశ్వర స్వామి ఇష్టమైన శనివారం కావడం... అదే రోజు ఆయన జన్మ నక్షత్రం శ్రవణం రావడంతో అంతే ఫలితం ఈరోజు కూడా ఉంటుందని అర్చకులు చెబుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం దీపం పెట్టి నక్షత్ర దర్శనమైన తరువాత ఉపవాసం విడిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. కోటి సోమవారం సందర్భంగా ఆలయాలకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. శనివారం కావడంతో మరింత ఎక్కువ సంఖ్యలో భక్తులు విచ్చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com