Kartika Rush : రాజమండ్రి గోదావరి ఘాట్ వద్ద కార్తీక రద్దీ

కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. రాజమండ్రి వద్ద గోదావరి తీరానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పుష్కర ఘాట్‌లకు భక్తులు పోటెత్తారు. స్నానాలు ఆచరించి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఏర్పాట్లు చేసింది. ఆలయాల్లోనూ తెల్లవారు జాము నుంచి భక్తుల రద్దీ నెలకొంది.
మరోవైపు.. ఇటు తెలంగాణలోని గోదావరి ఘాట్ల వద్ద కూడా భక్తులు బారులు తీరారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా తీర్దాల సంఘమేశ్వరాలయం, కూసుమంచి గణపేశ్వరాలయానికి తెల్లవారుజామునే వచ్చిన భక్తులు తరలివస్తున్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివలింగాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో భక్తులు దీపాలు వెలిగించారు. అనంతరం పాముపుట్టలో పాలు పోసి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com