AP : శ్రీకాకుళంలో 501 రకాలతో మహా నైవేద్యం

AP : శ్రీకాకుళంలో 501 రకాలతో మహా నైవేద్యం
X

శ్రీకాకుళం జిల్లాలో బొజ్జ గణపయ్యకు భక్తులు తమదైన శైలిలో మొక్కులు తీర్చుకున్నారు.. గణనాధుడికి ఐదు వందల ఒకటి రకాలతో మహా నైవేద్యం సమర్పించారు.. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి తిలక్ నగర్ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో స్థానికులు 501 రకాల నైవేద్యం గణనాధుడుకి పెట్టారు.

గణేష్ నవరాత్రులలో భాగంగా నిర్వాహకులు ఈ ఏర్పాట్లు చేశారు.. మహా నైవేద్యం సమర్పించడంలో భాగంగా భక్తులు భారీగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. గడచిన మూడేళ్లుగా తిలక్ నగర్ కాలనీ గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడంతోపాటు ప్రత్యేకత చాటుకుంటుండటం ఉత్సవ కమిటీ ప్రత్యేకత చాటుకుంటోంది.. మహా ప్రసాదం చూసేందుకు భక్తులు తండోప తండాలుగా వచ్చారు...

Tags

Next Story