Char Dham Yatra : చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నిలుపుదల

Char Dham Yatra : చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నిలుపుదల
X

చార్ ధామ్, కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరచుకోవడం ప్రారంభ మైంది. ఉత్తరాఖండ్ లోని చార్ ధామ్ యాత్రకు దేశ నలుమూలల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఊహించిన దాని కంటే యాత్రలో భారీ సంఖ్యలో భక్తులు యాత్రకు పోటెత్తుతున్నారు. దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

మే 31 వరకు చార్ ధామ్ ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ ను ప్రభుత్వం నిషేధించింది. కొన్ని రోజులుగా చార్ ధామ్ యాత్ర కోసం హరిద్వార్, డెహ్రాడూన్ శిబిరాల్లో ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ మే 31 వరకు మూసి వేయనున్నామని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పష్టం చేశారు.

ఆన్ లైన్ లో అప్లై చేసుకున్నవారికి యాత్ర కొనసాగిస్తున్నారు. నెలాఖరు తర్వాత ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ పై ఓ ప్రకటన రిలీజ్ చేయనున్నారు. వరుస వాయిదాలు తమ వ్యాపారంపై ప్రభావం చూపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు.

Tags

Next Story