Ayodhya : అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న ప్రియాంక చోప్రా

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) అయోధ్యలో బాలరాముడిని దర్శించుకున్నారు. భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్టీ మేరీ జోనాస్‌తో కలిసి బాలరామయ్య సేవలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రామజన్మభూమిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆమె తొలిసారి దర్శించుకున్నారు.
వీరికి సంబంధించిన ఫొటోలను ఆలయ ట్రస్ట్ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సోషల్ మీడియా ద్వారా విడుదల చేయగా.. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా పసుపు రంగు చీరను ధరించగా, నిక్ తెలుపు రంగు కుర్తా పైజామాను ధరించాడు. ఇక ఇప్పటికే అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా, కంగనా రనౌత్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, మాధురీ దీక్షిత్ వంటి బాలీవుడ్ తారలు అయోధ్య రాముడిని దర్శించుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com