Lunar Eclipse : చంద్రగ్రహణం.. మధ్యాహ్నం వరకు ఈ రాశుల వారు జాగ్రత్త

Lunar Eclipse : చంద్రగ్రహణం.. మధ్యాహ్నం వరకు ఈ రాశుల వారు జాగ్రత్త

Holi : హోలీ రోజే ఈ ఏడాది చంద్రగ్రహణం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలను అశుభంగా పరిగణిస్తారు. ఎందుకంటే దీని వల్ల చెడు ఎక్కువగా ఉంటుందనేది వారు చెప్పే సిద్ధాంతం. ఈ గ్రహణం ఈ రోజు ఉదయం 10:23కి ప్రారంభమై మధ్యాహ్నం 03:02 గంటలకు ముగుస్తుంది.

ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు, సూతక్ కాలం కూడా ఉండదు. కాబట్టి, మన దేశంలో ఈ పూజలతో పాటు రంగుల హోలీని కూడా సంతోషంగా జరుపుకోవచ్చు. అయితే ఈసారి చంద్రగ్రహణం వల్ల ఈ రాశుల వారికి ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

మీన రాశి : హోలీ రోజు ఏర్పడే చంద్రగ్రహణం మీనరాశి వారికి అశుభంగా ఉండనుంది. వైవాహిక జీవితంలో ఉన్నవారు మానసిక ఒత్తిడికి లోనయ్యి అనారోగ్యానికి గురవుతారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులు, ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా ఉంది.

కర్కాటక రాశి : గ్రహణ సమయంలో ఈ రాశివారు పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి. మీ జీవితంలో టెన్షన్ మొదలవుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. కాబట్టి.. జాగ్రత్తగా పరిహారాలు పాటించండి.

Tags

Read MoreRead Less
Next Story