Ayodhya : రాముడి నుదుటిపై సూర్య తిలకం.. నవమి రోజు మధ్యాహ్నం అయోధ్యలో అద్భుతం

ఏప్రిల్ 17న శ్రీరామనవమి రోజున అయోధ్యలోని రామమందిరం అరుదైన చరిత్ర సృష్టించనుంది. ఈ ఖగోళ అద్భుతాన్ని చూసే భాగ్యవంతులదే అసలైన అదృష్టం అంటున్నారు గురువులు. 17వ తేదీన రామ్ లల్లా విగ్రహం నుదుటిపై ‘సూర్య తిలకం’ సాక్షాత్కారం కానుంది.
శ్రీరామ నవమి రోజు మధ్యాహ్నం నాలుగు నిమిషాల పాటు ఈ అద్భుత ఘట్టాన్ని భక్తులు చూడగలుగుతారు. ఈ విధంగా రామ్ లల్లా విగ్రహం నుదుటిపై సూర్య తిలకం సాక్షాత్కారమయ్యేలా 'సూర్య తిలక్' మెషినరీని సిద్ధం చేశారు. CSIR-సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ CBRI సంస్థ సాయంతో ఈ అద్భుతం ఆవిష్కారం కానుంది.
శ్రీరామ నవమికి మరో వారం రోజులే సమయం ఉంది. నవ భారత చరిత్రలో ఏనాడూ లేనిరీతిలో అయోధ్య రామయ్య కొలువయ్యాక వస్తున్న తొలి శ్రీరామనవమి ఇది కావడంతో.. జనం శ్రీరామ నవమికి భక్తి పారవశ్యంతో సిద్ధమవుతున్నారు. అటు అయోధ్యలో రామయ్యకు కానుకల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com