Swarnagiri : స్వర్ణగిరి 100 రోజుల్లో 46 లక్షల మందికిపైగా దర్శనం

Swarnagiri : స్వర్ణగిరి 100 రోజుల్లో 46 లక్షల మందికిపైగా దర్శనం
X

యాదాద్రికి ( Yadadri ) సమీపంలో నిర్మించిన స్వర్ణగిరికి వంద రోజుల్లో రూ.12.49 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఛైర్మన్ రామారావు ( Chairman Ramarao ) తెలిపారు. ఆలయ ప్రతిష్ఠ జరిగిన తర్వాత నుంచి 46 లక్షలకు పైగా భక్తులు స్వర్ణగిరిశుడిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. రోజుకు 70వేల మంది స్వామివారి దర్శనానికి వస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో టైం స్లాట్స్ దర్శనాలు ఏర్పాటు చేస్తామన్నారు. స్వర్ణగిరి టెంపుల్​లో ధర్మకర్త మానెపల్లి రామారావు మాట్లాడుతూ గుడి ప్రారంభించిన వంద రోజుల్లోనే దాదాపు 50 లక్షల మంది శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారన్నారు. తద్వారా రూ.12.49 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.

యాదగిరిగుట్ట నారసింహ క్షేత్రంలో సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. ఆదివారం హాలీడే, సోమవారం బక్రీద్ సెలవు ఉండడంతో..రెండు రోజుల నుంచి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. దీంతో ధర్మదర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంట పట్టింది. రద్దీ అధికంగా ఉండడం, అందుకనుగుణంగా సదుపాయాలు లేకపోవడంతో కొందరు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లలో సరిపడా ఫ్యాన్లు లేకపోవడంతో.. ఉక్కపోత ఎక్కువై ఈ పరిస్థితి తలెత్తింది.

Tags

Next Story