Kedarnath : నేడు తెరుచుకోనున్న కేదార్నాథ్ తలుపులు

జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్నాథ్ ఆలయాన్ని నేడు ఓపెన్ చేయనున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ తలుపులు తెరవనున్నారు. ఈ విషయాన్ని బద్రీనాథ్ కేదార్ నాథ్ ఆలయ కమిటీ చైర్మెన్ అజేంద్ర అజయ్ తెలిపారు. చార్ధా థామ్ యాత్రలో భాగంగా కేదార్ నాథ్ ఆలయ ద్వారా లను నేడు 7 గంటలకు తెరవనున్నట్లు ఆయన చెప్పారు.ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ము మ్మరంగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా ఆలయాన్ని 40 క్వింటాళ్ల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నా థ్ ఆలయం ఒకటి. చార్ధామ్ యాత్రలో కేదార్ నాథ్ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్నాథ్కు చేరుకుని పరమేశ్వ రుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
అయితే ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఏటా శీతాకా లంలో దాదాపు ఆరు నెలల పాటు ఈ ఆలయ తలుపులు మూసే ఉంటాయి. ఆ సమయంలో ఆలయం మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. తిరిగి వేసవిలో ఈ ఆలయ తలుపులు తిరిగి తెరుస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com