TTD : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 12 గంటలు

TTD : తిరుమలకు పోటెత్తిన భక్తులు..  దర్శనానికి 12 గంటలు
X

తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు కావడంతో గత రెండు రోజులుగా రద్దీ పెరిగింది. ప్రస్తుతం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 65,313 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,780 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక గత ఏప్రిల్‌ నెలలో శ్రీవారిని 20.17 లక్షలు మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.101.63 కోట్లు రాగా.. 94.22 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయి. మరోవైపు ప్రతి సంవత్సరం సమ్మర్ సీజన్లో తిరుమలకు భక్తులు పోటెత్తుతారు. కానీ ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. వరుస సెలవులు వచ్చినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా పెరగలేదు. ఇక తిరుమలకి వెళ్ళిన భక్తులు కూడా ఎండల దెబ్బకు ఇబ్బంది పడుతున్నారు

Tags

Next Story