TTD : తిరుమల శ్రీవారి దర్శనం.. కంపార్ట్‌మెంట్లన్నీ ఫుల్

TTD : తిరుమల శ్రీవారి దర్శనం.. కంపార్ట్‌మెంట్లన్నీ ఫుల్
X

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కంపార్టుమెంట్లు నిండి నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 60,782 మంది దర్శించుకోగా, 30,100 మంది తలనీలాలు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. హుండీ ఆదాయం 3.53 కోట్లు లభించినట్లు పేర్కొన్నారు. . భక్తులు తిరుమలకు భారీగా తరలి వస్తున్న తరుణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా టీటీడీ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శుక్రవారం మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశాలున్నాయని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. దీంతో భక్తులు క్యూ లైనులో వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వివరించారు.

మరోవైపు తిరుమలలో వైసీపీ హయాంలో జరిగిన పనులపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆర్జిత సేవ, వీఐపీ బ్రేక్ టికెట్ల కేటాయింపు, శ్రీవాణి సేవా టికెట్ల ద్వారా వచ్చిన నిధుల వినియోగం, టెండర్లు, గదుల ఆధునికీకరణ, అగర్బత్తీల తయారీ వంటి అంశాలపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అన్నదానం, లడ్డూ తయారీ విధానాన్నీ పరిశీలించనున్నారు.

Tags

Next Story