TTD : తిరుమలలో క్యూలైన్‌లోకి భక్తులను నిలిపివేసిన టీటీడీ

TTD : తిరుమలలో క్యూలైన్‌లోకి భక్తులను నిలిపివేసిన టీటీడీ
X

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వేసవి సెలవులు, వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అటు కొండపైన భారీగా వర్షం కురుస్తుండటంతో క్యూలైన్లలో తాత్కాలికంగా రేకుల షెడ్డులను ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి నారాయణగిరి క్యూ లైన్లు దాటి.. శిలతోరణం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. క్యూలైన్ లో కి భక్తులను సాయంత్రం వరకు ఆపి ఆపి వదిలారు. సర్వదర్శనానికి మధ్యాహ్నం వరకు చూస్తే 36 గంటలు సమయం పట్టింది.

రద్దీ అంతకంతకూ అనూహ్యంగా పెరిగిపోవడంతో ప్రస్తుతానికి దర్శనాలు నిలిపివేశారు. ప్రస్తుతం వకులామాత వసతి గది దగ్గర వరకు భక్తుల రద్దీ పెరిగిపోయింది. అధిక రద్దీ కారణంగా క్యూలైన్లలోకి భక్తులని తాత్కాలికంగా నిలిపివేసింది టీటీడీ. తిరిగి ఆదివారం ఉదయం 6 గంటలకు భక్తులను అనుమతించనుంది.

Tags

Next Story